కలం వెబ్ డెస్క్ : ఏపీలో భోగి వేడుకలు(Bhogi celebrations) ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడనా భోగి మంటలతో సందడి నెలకొంది. ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు భోగి వేడుకల్లో నిమగ్నమయ్యారు. భోగి మంటల్లో పాత వస్తువులు వేసి దహనం చేయడం చూస్తుంటాం. కానీ, వైసీపీ నేతలు(YSRCP Leaders) వేడుకల్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. భోగి మంటల్లో ప్రభుత్వ జీవో(government GO) కాపీలను తగలబెడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ కోసం జీవోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని మొదటి నుంచి వైసీపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు జీవో కాపీలను మంటల్లో తగలబెడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భోగి మంటల్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను తగలబెట్టారు. చెత్తను తగులబెట్టినట్లుగానే ప్రజా వ్యతిరేక జీవోలను మంటల్లో వేశామని అవినాష్ అన్నారు, మరోవైపు నగరిలో మాజీ మంత్రి రోజా సైతం ఇలాగే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, నాయకులు కార్యకర్తలంతా ఇదే బాటలో వేడుకలు చేసుకుంటున్నారు.


