మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థీవదేహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నివాళులు అర్పించారు. సత్యనారాయణతో ఉన్న అనుబంధాన్ని స్పరించుకున్నారు. అనంతరం భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న తన సోదరి లక్ష్మమ్మను ఓదార్చారు. అంతకుముందు సత్యనారయణ రావు మృతి విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఫోన్‌లో హరీశ్ రావును పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read Also: జీవితంలో చేయాల్సి చాలా ఉంది: రోహిత్

