కలం, వెబ్ డెస్క్: అసియాలోని అతిపెద్ద జాతరైన మేడారానికి (Medaram) భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహాజాతర ప్రారంభానికి ముందే భక్తుల సందడి మొదలైంది. దేశ విదేశాల నుంచి భక్తుల రాక దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గద్దెల ప్రాంగణం, ఇతర అభివృద్ధి పనుల కోసం కోసం దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం మేడారం మహాజాతరలో అతి ముఖ్యమైన ఘట్టం గుడిమెలిగే (Gudi Mileage) పండుగ జరగనుంది.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే ఆలయ పండుగ. పాత గుడికి మరమ్మతులు చేసి మళ్లీ తెరిచే సమయంలో ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు, హోమాలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. కొన్ని చోట్ల జానపద నృత్యాలు, ఊరేగింపులు ఉంటాయి. ఈ పండుగ గ్రామ ఐక్యతను పెంచుతుంది. దేవాలయానికి కొత్త ఉత్సాహం తీసుకువస్తుంది. దేవుడి కృప మళ్లీ గ్రామంపై పడుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంటుంది.


