కలం వెబ్ డెస్క్ : మూడు రోజుల సంక్రాంతి(Sankranti) వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి వేడుకలు(Bhogi celebrations) తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచే ప్రజలు ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుంటున్నారు. పండుగ సందర్భంగా ప్రజలు ఆలయాల్లో(temples) ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భోగి వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. భీమవరంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోమన్ నాయుడు తమ ఇంటి వద్ద నిర్వహించిన వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. నగరిలో మాజీ మంత్రి రోజా వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతిలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం భోగి వేడుకల్లో పాల్గొంది. ఇక తిరుమలలోశ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ముందు భోగి మంటలు వేశారు. టీటీడీ(TTD) ఆధ్వర్యంలో ఆలయం ప్రధాన ద్వారం వద్ద వేడుకలు నిర్వహించారు. అర్చకులు, భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులు భోగి మంటల చుట్టూ తిరుగుతూ, గోవింద నామాన్ని స్మరిస్తూ పాటలు పాడారు.


