కర్నూలు బస్సు ప్రమాదం నుంచి తేరుకోక ముందే మరో బస్సు మంటలకు ఆహుతయింది. జైపూర్(Jaipur) నుంచి ఢిల్లీ వెళ్లే హైవేలో ప్రయివేట్ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.
వరుస బస్సు ప్రమాదాలు జరగడం అందులోనూ ప్రైవేటు స్లీపర్ బస్సులో ఈ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. బస్సులో ప్రయాణం అంటే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో చాలా మంది రైల్వే ప్రయాణ సేవల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బస్సుల నిర్వహణ, ప్రైవేటు బస్సుల అనుమతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also: కోనసీమలో ‘మొంథా’ బీభత్సం..

