కలం, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla)జిల్లాలో రోడ్డు భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఇన్ చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Garima Agrawal) ఆదేశించారు. హెల్మెల్ లేకుంటే బంకుల్లో పెట్రోల్ పోయొద్దని చెప్పారు. రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్ లో మంగళవారం నిర్వహించారు. ఇందులో ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్, పీఆర్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్, వైద్య, ఎక్సైజ్, విద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ చర్చలు జరిపారు. రవాణా, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన క్షేత్రస్థాయి పరిశీలనపై ఆరా తీశారు.
సిద్దిపేట నేషనల్ హైవే, వేములవాడ- కోరుట్ల రోడ్డు, కరీంనగర్- కామారెడ్డి హైవే, సిరిసిల్ల – కరీంనగర్ హైవేల మీద గుర్తించిన బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఏర్పాటు చేయాల్సిన రంబుల్ స్ట్రిప్స్, సోలార్ సిగ్నల్స్, సైన్ బోర్డ్స్, రోడ్ల మరమ్మతులు, కనెక్టింగ్ రోడ్ల కోసం ప్లాన్ రెడీ చేసి వచ్చే సమావేశంలో అందజేయాలని ఇన్ చార్జి కలెక్టర్ గరిమ ఆదేశించారు. అలాగే పై రహదారుల్లో స్పీడ్ గన్స్, సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆయా శాఖల ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఆల్రెడీ ఉన్న వాటిని మరోసారి పరిశీలించాలని సూచించారు.
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ లలో కచ్చితంగా ‘నో హెల్మెట్.. నో పెట్రోల్‘ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ గరిమ సూచించారు. దీన్ని ప్రతి బంకు ఓనర్ సామాజిక బాధ్యతగా తీసుకుని సక్సెస్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్నవారు బైక్ పై జర్నీలు చేసేవాళ్లే అని.. వాళ్లు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని కలెక్టర్ కోరారు. పరిమితికి మించి స్టూడెంట్లు, ప్రయాణికులను తరలిస్తున్న ఆటోలు, బస్సులను తనిఖీ చేయాలని, ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలపై దృష్టి సారించాలని చెప్పారు. రోడ్డు ప్రమాద బాధితులను హాస్పిటల్ కు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడే వారికి అందించే రహవీర్ అర్థిక సహాయంపై కలెక్టర్ సమీక్ష చేశారు.
అరైవ్.. అలైవ్ అమలు
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అరైవ్.. అలైవ్ జిల్లాలో 10 రోజులపాటు అమలు చేస్తామని ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు, యువతకు వ్యాస రచన, క్విజ్ లాంటి పోటీలు నిర్వహిస్తామని వివరించారు. సిరిసిల్ల (Rajanna Sircilla), వేములవాడలో ప్రధాన రోడ్లపై ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
Read Also: అల్లు అర్జున్ను కాంగ్రెస్ అరెస్ట్ చేయలేదా?.. రాహుల్పై తమిళిసై ఫైర్
Follow Us On: X(Twitter)


