కలం, తెలంగాణ బ్యూరో: చట్టాలు చేసే లెజిస్లేటర్లే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వీరే ఎగవేతదారులు అవుతున్నారు. చాలామంది నేతలపై పదుల సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులున్నాయి. ‘ఓవర్ స్పీడ్’ కారణంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు (Traffic Challans) వేశారు. నిత్యం ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పే నేతలు ఈ నీతులు ప్రజలకు మాత్రమే… మాకు కాదు.. అనే తీరులో వ్యవహరిస్తున్నారు. నిర్దిష్ట గడువులోగా చలాన్లు కూడా కట్టడంలేదు. వార్తలుగానీ, కథనాలుగానో వారిమీద వార్తలు వస్తే ఠక్కున చలాన్లు కట్టేస్తున్నారు. ప్రజలకు దారి చూపాల్సిన ప్రజాప్రతినిధులే దారి తప్పుతున్నారు. దీంతో సామాన్య జనం వారిని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారనే చర్చ మొదలైంది. ఇంకోవైపు చలాన్లు చెల్లించడంతో వారు అతిక్రమించిన ట్రాఫిక్ నిబంధనల నేరం ‘బారా ఖూన్ మాఫ్’ తరహాగా మారిపోయింది.
సిటీలో రెగ్యులర్ ట్రాఫిక్ చెకింగ్స్ :
హైదరాబాద్‌లో అనేక రద్దీ రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలుచ చేస్తున్నారు. పగటి సమయాల్లో ట్రాఫిక్ చలాన్ల పేమెంట్ కోసం.. సాయంత్రం తర్వాత డ్రంకెన్ డ్రైవ్ పోలీసింగ్.. అక్కడికక్కడే పెండింగ్ చలాన్ల డబ్బుల్ని వసూలు చేస్తున్నారు. కుదరకపోతే ఇంటికి నోటీసులు!! కట్టకపోతే.. కోర్టులకు హ్యాండోవర్. ట్రాఫిక్ చలాన్ల సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ‘ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్’ గురించి పోలీసు శాఖకు సూచన చేశారు. వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా కట్ అయ్యేలా విధానం రావాలన్నారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్‌లెస్ డ్రైవింగ్.. ఇలాంటివి సిటీ రోడ్లపై షరా మామూలు అన్నట్లుగా తయారైంది. ప్రజా ప్రతినిధుల ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, నో పార్కింగ్ ఉల్లంఘన, స్టాప్ లైన్ క్రాసింగ్.. ఇవన్నీ కామన్ అన్నట్లుగా తయారైంది.
సీఎం కాన్వాయ్ వాహనాలపై కామెంట్స్ :
సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలు ఓవర్ స్పీడ్‌తో ట్రావెల్ చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫోటోలు, వివరాలతో సహా వార్తలు వచ్చాయి. బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ సహా కాన్వాయ్‌లోని అన్ని వాహనాలకు సెక్యూరిటీ ప్రకారం ఒకే నెంబర్ ఉంటున్నది. TG-09-RR-0009 నంబర్ వెహికల్ 2024 ఏప్రిల్ 17 నుంచి 2025 జూలై 11 వరకు ఓవర్ స్పీడ్ పేరుతో 16 చలాన్లు (Traffic Challans) పేమెంట్ చేయకుండా పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి రూ. 17,795 కట్టాల్సి ఉన్నది. సోషల్ మీడియా వార్తలతో అవన్నీ ఒకేసారి క్లియర్ అయ్యాయి. డేంజరస్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్, అనాథరైజ్డ్ పార్కింగ్.. ఇలాంటి పలు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఆ వాహనాలపై నమోదయ్యాయి.
కేటీఆర్, కవిత వాహనాలు సైతం :
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన చెల్లెలు కవిత వాడే వాహనాలపైనా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కేటీఆర్ వెహికల్ (TS-07-GE-6666) గతేడాది మార్చి 6 నుంచి జూలై 1 మధ్య ఓవర్ స్పీడ్/ డేంజరస్ డ్రైవింగ్ పేరుతో రూ. 3,340 చలాన్లు పెండింగ్‌లో ఉండేవి. అవి ఇటీవలే క్లియర్ అయ్యాయి. గతేడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఓవర్ స్పీడ్ చలాన్లు రెండు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లెక్సస్ (Lexus) వాహనంపైనా (TS-09-EU-6666) ఓవర్ స్పీడ్/డేంజరస్ డ్రైవింగ్ చలాన్ల పేరుతో రూ. 15,200 పెండింగ్‌లో ఉంది. కారణమేంటో తెలియదుగానీ ఇటీవల ఆ వెహికల్ స్థానంలో బెంజ్ కారు వాడుతున్నారు. చట్టాలను గౌరవించాల్సిన నేతలే ఉల్లంఘనలు చేయడం, చలాన్ల అమౌంట్ కట్టకుండా ఎగవేయడం గమనార్హం.
Read Also: బీజేపీ కొత్త చీఫ్‌గా నితిన్ నబిన్
Follow Us On: Sharechat


