epaper
Tuesday, November 18, 2025
epaper

కోనసీమలో ‘మొంథా’ బీభత్సం..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై ‘మొంథా(Cyclone Montha)’ తుఫాను ప్రభావం భారీగా ఉంది. కోన సీమ(Konaseema)లో ‘మొంథా’ వర్ష బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడిక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి భారీగా సిబ్బందిని రంగంలోకి దింపారు. దాదాపు వెయ్యి మంది సిబ్బందిని కేటాయించారు ఉన్నతాధికారులు. పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా చెట్లు కూడా పడ్డాయి. అమలాపురంలోని జాయింట్ కలెక్టర్ నివాసం దగ్గర పలు చెట్లు కూలాయి. ఈ క్రమంలో ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమయితేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వరద ముప్పు కూడా ఉన్న నేపథ్యంలో సహాయక శిబిరాల ఏర్పాటుపైన కూడా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రభుత్వం కూడా మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ప్రతి గంటలకు తుఫాను కదలికలపై అప్‌డేట్స్ స్వీకరిస్తోంది. ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉండటానికి ఎప్పటికప్పుడు అన్ని శాఖ అధికారులతో ప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంది.

Read Also: అంతర్జాతీయ బోర్డర్‌లో మొదలైన రోడ్డు పనులు..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>