కలం, సినిమా: గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం‘తో హిట్ కొట్టింది యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). ఈ సంక్రాంతికి అనగనగ ఒక రాజు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ఈనెల 14న థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఈవెంట్‌లో సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది మీనాక్షి. తనకు కాబాయో లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలో ఆమె క్లియర్ గా చెప్పేసింది.
తనకు కాబోయో వాడికి కనీస వంద ఎకరాల వరి పొలం, రాజ్మా పంట ఉండాలని చెప్పింది. ఎందుకంటే ఆమెకు రాజ్మా చావల్ తినడం ఇష్టమట. అలాగే తనకు రోజుకు మూడు గిఫ్టులు ఇవ్వాలని అంది. గిఫ్ట్‌లు తీసుకోకుండా ఉండటం తన వల్ల కాదని చెప్పింది. తన భర్తకు గతంలో బ్రేకప్స్ జరిగినా పట్టించుకోనని చెప్పడం ఆమె విశాల హృదయానికి నిదర్శనం. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరినీ కోరుకోవడం లేదని, ఉమ్మడి కుటుంబంలోని అత్తగారు కావాలనుకుంటున్నట్లు మీనాక్షి తెలిపింది. అత్తగారి ఉమ్మడి కుటుంబంలోని డ్రామా ఎక్సిపీరియన్స్ చేయాలని ఉందని ఆమె చెప్పింది.
మీనాక్షి తనకు కాబోయో వాడి గురించి చెప్పిన ఈ వీడియో బాగా వ్యూస్ రాబడుతోంది. కెరీర్ పరంగా చూస్తే.. మీనాక్షికి ‘అనగనగ ఒక రోజు‘ సినిమా మరో హిట్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు వస్తున్న రెస్పాన్స్ తో సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఏర్పడుతున్నాయి. లాస్ట్ సంక్రాంతి సక్సెస్‌ను ఆమె రిపీట్ చేస్తే మరింత క్రేజీ హీరోయిన్‌గా మారడం ఖాయం.

Read Also: స్పిరిట్ నుంచి సంక్రాంతికి మరో అప్ డేట్..
Follow Us On: Sharechat


