కలం, వెబ డెస్క్ : సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఒక ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం జరిగిన తీరు భయానకంగా ఉంది. ఆటోలో తీసుకెళ్తున్న ఫ్లెక్సీ రాడ్లు, బస్సును ఢీకొట్టిన వేగానికి నేరుగా బస్సు లోపలికి చొచ్చుకుపోయాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ రాడ్లు బలంగా తగలడంతో పాటు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటోలోని ఒక వ్యక్తి మృతి చెందారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి (Sangareddy) జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Read Also: బీర్ల తయారీ పెంచండి.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు..
Follow Us On : WhatsApp


