epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘జన నాయగన్​’ను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడే: రాహుల్​ గాంధీ

కలం, వెబ్​డెస్క్​: నటుడు విజయ్​ కథానాయకునిగా నటించిన ‘జన నాయగన్​’ (Jan Nayagan) మూవీపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్​ చిక్కులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలతో నిర్మించిన ఈ సినిమాకు సెన్సార్​ బోర్డ్​ సర్టిఫికెట్​ నిరాకరించింది. దీనిపై ‘జన నాయగన్​’ సినిమా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ అంశం కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్​ మధ్య వివాదం రాజేసింది. కాంగ్రెస్​ నాయకుడు, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ‘ఎక్ప్​’ వేదికగా ప్రధాని మోదీపై విమర్శలకు దిగారు. జన నాయగన్​ను అడ్డుకోవడమంటే తమిళుల సంస్కృతిపై దాడికి దిగినట్లేనన్నారు.

‘సమాచార, ప్రసార శాఖ జన నాయగన్​ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది తమిళుల సంస్కృతిపై దాడి చేయడమ. మోదీజీ.. తమిళుల గొంతును నొక్కడంలో మీరెప్పటికీ గెలుపొందలేరు’ అని తన ‘ట్వీట్​’లో రాహుల్​ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు. తమిళనాడులో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో విజయ్(Actor Vijay) పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే)తో కాంగ్రెస్​ పొత్తు కుదుర్చుకోనుందనే వార్తల నేపథ్యంలో రాహుల్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కాగా, రాహుల్​ వ్యాఖ్యలపై కేంద్రం నేరుగా స్పందించనప్పటికీ.. నిబంధనల ప్రకారమే జన నాయగన్​కు సెన్సార్​ ​ నిరాకరించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

తమిళనాడులో సామాజిక మార్పు కోసం అంటూ టీవీకే పార్టీని రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్..‘జన నాయగన్​’ తన చివరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో విజయ్​కు చిక్కులు ఎదురవుతున్నాయి. నిరుడు కరూర్​లో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించడంపై ఇటీవల సీబీఐ విచారణకు విజయ్​ హాజరయ్యారు. మరోవైపు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ‘జన నాయగన్​’ మూవీకి సెన్సార్​ బోర్డ్​ సర్టిఫికెట్​ నిరాకరించింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>