కలం, వరంగల్ బ్యూరో : జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) కి ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. జనగామ జిల్లాలో ఆయన కూతురు తుల్జా భవాని పేరిట ఉన్న ఆస్తులను అధికారులు అటాచ్ చేసారు. జనగామలోని ఆరు ప్లాట్లు, చేర్యాల లో ఉన్న స్థలాలు అటాచ్ చేసినట్లు సమాచారం. గతంలో ఈ భూముల విషయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి తన కూతురు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వివాదాస్పద భూముల కొనుగోలు విషయంలో తన తండ్రి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టానని అంతకు మించి తనకేమి తెలియదని చెప్పారు. అంతేగాకుండా ఆ భూములు తన తండ్రి కబ్జా చేశాడంటూ వచ్చిన ఆరోపణలపై ఆమె పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

Read Also: ఉగ్రవాదులు దాడులకు దిగితే గట్టిగా బదులిస్తాం.. ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్
Follow Us On: X(Twitter)


