కలం, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ హీరో యశ్ టాక్సిక్ (Toxic) మూవీపై వివాదం ముదురుతోంది. ఆ మూవీలో అశ్లీల సీన్లు ఉన్నాయని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోవాలని కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. వెంటనే టీజర్‌ను తొలగించాలని, ఇంటిమేట్ సీన్లు మరీ బోల్డ్‌గా ఉన్నాయని మండిపడింది.
ఇప్పటికే ఆప్ రాష్ట్ర యూనిట్ మహిళా విభాగం నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్ అధికారులను కలిసి, టీజర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. నిబంధనల ప్రకారం పిటిషన్లో పేర్కొన్న అంశంపై తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ సమర్పించిన పిటిషన్‌ను మేరకు కమిషన్ కార్యదర్శి CBFCకు లేఖ రాశారు.
టీజర్‌లోని (Toxic Teaser) అశ్లీల కంటెంట్ ఉందని, మహిళలు, పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఎలాంటి హెచ్చరిక లేకుండా పబ్లిక్ డొమైన్లో విడుదల చేసిన దృశ్యాలు “మహిళల గౌరవాన్ని, కన్నడ సంస్కృతిని అవమానించేలా” ఉన్నాయని ఆరోపించారు. ఈ దృశ్యాలు మైనర్లపై చెడు ప్రభావాన్ని చూపుతాయని తేల్చి చెప్పారు. కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని టీజర్‌ను తొలగించాలని కోరింది.
Read Also: ఫస్ట్ డే చిరు MSG మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా!
Follow Us On: Sharechat


