కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి (Sankranti) పండుగ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. గత నాలుగు రోజులుగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి, టోల్ ప్లాజాలు (Panthangi Toll Plaza) వాహనాలతో కిక్కిరిసిపోయాయి. దీంతో ఆయా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే జనం ప్రభుత్వ వాహనాల బదులు సొంత వాహనాల్లో వెళ్తున్నారు.
ఈ క్రమంలో భారీగా కార్లు రోడ్డెక్కుతున్నాయి. సిటీ శివారు దాటడానికే కనీసం 4 గంటల సమయం పడుతుందంటే ట్రాఫిక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి రద్దీ మంగళవారం మరీ ఎక్కువైంది. హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడ వైపు కార్లు, బస్సులు భారీగా సాగుతున్నాయి. దీంతో పంతంగి టోల్ ప్లాజా (Panthangi Toll Plaza) వద్ద సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ఫ్లాజా నుంచి దాదాపు రెండు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.
Read Also: చరిత్ర సృష్టించిన దేవదత్ పడిక్కల్..
Follow Us On: Sharechat


