కలం, వెబ్ డెస్క్: భారత్లో బంగ్లాదేశ్ జట్టుకు ముప్పు ఉందన్న వ్యాఖ్యలపై ఐసీసీ (ICC) తాజాగా స్పందించింది. తాము చేసిన అంతర్గత సర్వే ప్రకారం బంగ్లాదేశ్ జట్టుకు భారత్లో ప్రత్యేకమైన ముప్పు ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఐసీసీ అంతర్గత భద్రతా అంచనాల ప్రకారం బంగ్లాదేశ్ జట్టు భారత్కు ప్రయాణించేందుకు పూర్తి క్లియరెన్స్ లభించింది. మొత్తం పరిస్థితి నియంత్రణలోనే ఉందని, కొన్ని వేదికల్లో మాత్రమే తక్కువ స్థాయి నుంచి మధ్యస్థ స్థాయి రిస్క్ కనిపిస్తోందని తెలిపింది. ఇవన్నీ సాధారణ భద్రతా ప్రమాణాల పరిధిలోనే ఉన్నాయని ఐసీసీ వివరించింది. ఇంతకుముందు బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు చేసిన వ్యాఖ్యలపై కూడా స్పష్టత ఇచ్చింది. అవి సాధారణ ప్రత్యామ్నాయ ప్రణాళికలు, ఊహాజనిత పరిస్థితులపై ఆధారపడ్డవే తప్ప నిజమైన హెచ్చరికలు కాదని పేర్కొంది.
భారత్ వెలుపల మ్యాచ్లు నిర్వహించాలని బీసీబీ చేసిన అభ్యర్థనకు ఈ భద్రతా నివేదికకు సంబంధం లేదని బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఐసీసీ (ICC) నుంచి అధికారిక సమాధానం ఇంకా రావాల్సి ఉందని తెలిపింది. ముస్తాఫిజుర్ రహమాన్ ఐపీఎల్ జట్టు కేకేఆర్ నుంచి విడుదలైన ఘటనతో మొదలైన వివాదానికి ఇప్పుడు ఐసీసీ నివేదికతో స్పష్టత వచ్చింది. తాజాగా ఐసీసీ చేసి వ్యాఖ్యలతో టీ20 వరల్డ్ కప్లో భారత్ వేదికగానే బంగ్లాదేశ్ ఆడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
Read Also: చరిత్ర సృష్టించిన దేవదత్ పడిక్కల్..
Follow Us On : WhatsApp


