కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి అంటే రంగవల్లులు, పిండి వంటలు, కోడి పందాలు మాత్రమే కాదు.. పతంగుల పండుగ కూడా. అందుకే ప్రతి ఏడాది హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్ (Kite Festival) గ్రాండ్‌గా జరుగుతుంటుంది. ఈ ఏడాది ఫెస్టివల్‌కు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. మంగళవారం (ఇవాళ) నుంచి నుంచి ఈ నెల 18 వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ కైట్ ఫెస్టివల్ కు 19 దేశాలకు చెందిన 40 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది ప్లేయర్స్ హైదరాబాద్‌కు వచ్చారు.
ఉదయం 10.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు గాలిపటాలను ఎగురవేస్తారు. గాలి పటాలను ఇష్టపడేవారికి ఇది మంచి అనుభూతినిస్తుంది. అలాగే గచ్చిబౌలి స్టేడియంలో రెండు రోజులు ఒక ప్రత్యేకమైన డ్రోన్ షో నిర్వహించబడుతుంది. మకర సంక్రాంతి (Sankranti) సందర్భంగా జరిగే ఈ కైట్ ఫెస్టివల్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా మారుతోంది.

Read Also: రాచకొండ పేరు మార్పు వెనక కథ
Follow Us On: X(Twitter)


