కలం, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు (Polavaram Nallamala Sagar) వల్ల తెలంగాణకూ లాభమే జరుగుతుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు (Rama Naidu). పోలవరం-నల్లమలపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో మంత్రి రామానాయుడు స్పందించారు. ‘గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. అందుకే గోదావరిపై తెలంగాణ వాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతామంటే మేం అడ్డు చెప్పలేదు. ఎగువన ఉన్న రాష్ట్రాలు ఏదైనా ప్రాజెక్టు కడితే కింద ఉన్న రాష్ట్రాలకు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. కానీ దిగువన ఉన్న ఏపీలో కట్టే పోలవరం-నల్లమల సాగర్ వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ అవసరాలు తీరాక.. తెలంగాణ రాష్ట్రం కూడా నీటిని వాడుకునే ఛాన్స్ ఉంటుంది’ అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
ప్రతి ఏడాది గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే మేం వాడుకుంటామని చెబుతున్నామన్నారు మంత్రి. ఏపీ ఆ నీటిని వాడుకోకుంటే బంగాళాఖాతంలోనే కలిసిపోతాయని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో 1,53,000 టీఎంసీల గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలో కలిశాయని.. అలాంటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఆ నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి నిమ్మల. తెలంగాణ ప్రభుత్వం పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అడ్డు చెప్పొద్దని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని విధాలుగా ముందుకెళ్లాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయం అని.. ఆ విధంగా అందరం సహకరించుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు (Rama Naidu) కోరారు.
Read Also: ఏపీలో మద్యం ధరలు పెంపు..
Follow Us On : WhatsApp


