కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్. అన్నదాతలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. సన్నాలకు ప్రకటించిన బోనస్ (Paddy Bonus) సొమ్ము రూ.500కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బోనస్ సొమ్మును విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. దీంతో కలుపుకొని ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.1,425.91 కోట్లను బోనస్ రూపంలో సన్నాలకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది కనీస మద్దతు ధరకు అదనం. ఈ ప్రకారం ఎంఎస్పీతో కలసి క్వింటాల్‌కు రూ.2,889ని రైతులకు ఇచ్చారు. కాగా, సన్నాలకు బోనస్ ఇస్తామంటూ గతంలోనే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also: రాముని జోలికి వస్తే ఊరుకునేది లేదు
Follow Us On : WhatsApp


