కలం, వెబ్డెస్క్: ఈ ఏడాది ఫిబ్రవరి (February 2026) ప్రత్యేకత తెలిస్తే వావ్ అనాల్సిందే. ఎందుకంటే.. ఇలాంటి ఫిబ్రవరిని మన జీవితంలో మళ్లీ చూడలేం. ఇది అలాంటి ఇలాంటి నెల కాదు మరి. 823 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ఫిబ్రవరిలో అన్ని రోజులు నాలుగేసి సార్లు వస్తాయి. అంటే.. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలన్నీ ఒక్కొక్కటి నాలుగు సార్లు వస్తాయి.
వచ్చే నెల 1,8,15,22 తేదీలు ఆదివారం కాగా, సోమ–2,9,16,23న; మంగళ–3,10,17,24న; బుధ–4,11,18,25న; గురు–5,12,19,26న; శుక్ర–6,13,20,27న; శనివారం–7,14,21,28న వస్తున్నాయి. ఇలా రావడం 823 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుందట. అంటే ఈ ఏడాది ఫిబ్రవరి లాంటిది మళ్లీ చూడడం ఇప్పుడు జీవించిన ఉన్న వాళ్లకు అసాధ్యం. అందుకే రాబోయే ఫిబ్రవరి (February 2026) ని ‘మిరాకిల్ మంత్’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: సంక్రాంతి వేళ మటన్, చికెన్ ధరలకు రెక్కలు..!
Follow Us On : WhatsApp


