కలం, వెబ్ డెస్క్ : నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఇది. సంక్రాంతి వేళ మటన్, చికెన్ ధరలు భారీగా పెరిగాయి. సంక్రాంతి సీజన్ లో తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి రేట్లు పెరగడం కామన్ అయినా.. ఈ సారి రేట్లు ఊహించినదాని కంటే ఎక్కువ పెరిగాయి. ముఖ్యంగా నాటుకోడి కేజీ రేటు (Chicken Price) రూ.2వేల నుంచి రూ.2500 దాకా పలుకుతోంది. మామూలు రోజుల్లో దీని ధర రూ.800 లేదా రూ.900గా ఉండేది. ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో అమాంతం రేట్లు పెంచేశారు. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో రేట్లు భారీగా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ తో పాటు మిగతా తెలంగాణ జిల్లాల్లో నాటుకోడి కేజీ రేటు రూ.600 నుంచి రూ.750 దాకా ఉంది.
ఇక బాయిలర్ కోడి విషయానికొస్తే.. కేజీ రూ.350 దాకా పలుకుతోంది. నెల క్రితం రూ.230 నుంచి రూ.250 దాకా ఉంది. సంక్రాంతి సీజన్ స్టార్ట్ కావడంతో ఈ బాయిలర్ కోళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కేజీ మీద ఏకంగా రూ.100 దాకా పెంచేశారు వ్యాపారస్తులు. హైదరాబాద్ లో కేజీ బాయిలర్ చికెన్ రూ.330 దాకా పెరిగింది. కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాల్లో సరఫరాను బట్టి ఇంతకంటే ఎక్కువే ఉంది.
ప్రస్తుతం మటన్ ధరలు కేజీకి రూ.800 నుంచి రూ.900 దాకా ఉన్నాయి. మటన్ ధరల్లో భారీ పెరుగుదల కనిపించట్లేదు. కానీ నాటుకోడి ధరలు (Chicken Price) మాత్రం మటన్ కంటే ఎక్కువ పెరగడం షాకింగ్ గా మారింది. ఇంకో నెల పాటు ఈ ధరలు కంటిన్యూ అవుతాయని పౌల్ట్రీ వ్యాపారస్తులు చెబుతున్నారు. చలికాలంలో కోళ్లు ఎక్కువగా చనిపోవడం, దాణా, ఫామ్ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో పాటు.. డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ ధరలు పెరిగినట్టు చెబుతున్నారు.
Read Also: చలాన్ పడితే ఖాతా ఖాళీ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం !
Follow Us On : WhatsApp


