epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ప్రాణాలకు తెగించి కాపాడారు.. ప్రశంసలు పొందారు

కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా ఏడుపాయల వనదుర్గామాత దేవాలయం సమీపంలోని ఘనపూర్ అనకట్ట వద్ద, కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్య అనే వ్యక్తి నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న QRT–1 (Quick Response Team) సిబ్బంది పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. ప్రమాదకరమైన నది ప్రవాహాన్ని లెక్కచేయకుండా, తాడు సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు.

వారి ధైర్యసాహసం, సమయస్ఫూర్తి చూపించిన QRT–1 పోలీస్ సిబ్బందికి మెదక్  జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయంకు పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాలకు తెగించి కాపాడిన QRT–1 పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసించడమే కాకుండా క్యాష్ రివార్డ్ ప్రకటించారు. గతంలోనూ ఏడుపాయల వనదుర్గామాత ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆత్మహత్యలకు ప్రయత్నించిన వారు, అలాగే నీటి లోతు తెలియక ప్రమాదంలో చిక్కుకున్న అనేక మందిని ధైర్యసాహసాలతో QRT బృందాలు సకాలంలో రక్షించిన సంఘటనలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.

Read Also: ఇలాంటి ఫిబ్రవరిని జీవితంలో మళ్లీ చూడలేం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>