కలం, సినిమా : యంగ్ హీరో హవిష్( Havish) హిట్ కొట్టేందుకు సిద్దం అంటున్నారు. గతంలో నువ్విలా, జీనియస్, రామ్‌లీల, సెవెన్ వంటి విభిన్న చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాల ఫలితం ఎలా ఉన్నా డిఫరెంట్ మూవీస్ చేశాడనే పేరు హవిష్‌కు దక్కింది. హీరోగా కొంత గ్యాప్ తీసుకున్న హవిష్.. ఇప్పుడు “నేను రెడీ” (Nenu Ready) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన (Trinadharao Nakkina) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్ , ధమాకా వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దర్శకుడిగా ఆయనకు ఆ సినిమాలు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు హవిష్తో అలాంటి హిట్ మూవీనే ఆయన చేస్తున్నట్లుగా అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఈ రోజు ‘నేను రెడీ’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్లో ఒక కుటుంబ బాధ్యతను మోసే యువకుడి పాత్రలో హవిష్ కనిపించారు. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు లవ్, రొమాన్స్, యాక్షన్ వంటి అంశాలు టీజర్లో ఆకట్టుకున్నాయి. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారనే ఇంప్రెషన్ టీజర్ కలిగించింది.
నేను రెడీ (Nenu Ready) చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా బ్యానర్ పై నిఖిల కోనేరు (Nikhila Koneru) నిర్మిస్తున్నారు. హవీష్ సోదరి అయిన ఈమె ఈ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మనందం, శ్రీ లక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవి గణేష్ ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. త్వరలోనే నేను రెడీ సినిమా విడుదలకు సిద్దమవుతోంది.
Read Also: ప్రభాస్‌కు బ్యాడ్ చేస్తున్న సొంత అభిమానులు
Follow Us On : WhatsApp


