కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత పూర్తిగా తనదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ& క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నాయకులు కుమ్మక్కయ్యారని కొందరు అనుకుంటున్నారు. కానీ మనమంతా కుటుంబ సభ్యులం. ఇందులో కుమ్మక్కయ్యేది ఏముంది. రాష్ట్రాన్ని నడిపేది ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. మేం మహా అయితే 200 మంది కూడా లేము. 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యుగులే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. మారింది కేవలం సీఎం, మంత్రులు మాత్రమే. మీరు ఎప్పటికీ అలాగే ఉంటారు. మనమంతా కలిసి పనిచేస్తుంటే ఓర్వలేని వారు ఎప్పుడూ ఉంటారు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
దేవతలు కూడా యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి ప్రయత్నిస్తారని.. ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి అసెంబ్లీకి మారీచుడు లాంటి వాళ్లను పంపిస్తున్నాడంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా సరే.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు ముఖ్యమంత్రి. ‘గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మాపై మోపి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతి నెల ఆదాయం 18 వేల కోట్లు మాత్రమే. కానీ ప్రతీ నెలా 22 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి. మీరు మీ కుటుంబాలను ఎలా నడుపుతున్నారో.. మేం కూడా అంతే జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాం. మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లడం వల్లే సమాజంలో తెలంగాణ గౌరవం నిలబడింది.
మీరే మా సారధులు, మా వారధులు. నేను ఎప్పుడూ మీ వైపే ఉంటాను. గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడొచ్చేవి.. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో మీరే ఒకసారి ఆలోచించుకోండి. సంక్రాంతి కానుకగా మీ డీఏపై సంతకం చేసి వచ్చా. ప్రతి ఉద్యోగికి కోటి రూపాయల బీమా సౌకర్యం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement Benefits) సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).
Read Also: జిల్లాలు రద్దు చేస్తే అగ్గి పుట్టిస్తాం.. కేటీఆర్ ఫైర్
Follow Us On: Sharechat


