epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ప్రభాస్‌కు బ్యాడ్ చేస్తున్న సొంత అభిమానులు

కలం, సినిమా :  రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీ రాజాసాబ్ (RajaSaab) సినిమాకు సొంత అభిమానులే బ్యాడ్ చేస్తున్నారనే ఇంప్రెషన్ అందరిలో కలుగుతుంది. ఈ సినిమా విషయంలో రెబల్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించడం మూవీకి తీవ్ర నష్టాన్నికలిగిస్తుంది. వింటేజ్ స్టైల్ లో ప్రభాస్ కనిపించిన రాజాసాబ్ సినిమా మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ ను కలర్ ఫుల్ డ్రెస్సుల్లో, మంచి డ్యాన్సులతో, హీరోయిన్స్ తో కలిసి రొమాంటిక్ సీన్స్ లో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ కూడా బాహుబలికి ముందు ప్రభాస్ ను చూపిస్తున్నామని పదే పదే చెబుతూ వచ్చింది.

అయితే సినిమా రిలీజ్ అయ్యాక ప్రమోషన్స్‌లో చెప్పిన రేంజ్ కంటెంట్ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాపరిచింది. మూవీ ఓవరాల్‌గా బాగున్నా కానీ తమ హీరోను ఇంతకంటే బాగా చూడాలనుకున్నామంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా (Rajasaab) ఆశించిన రేంజ్ లో లేదని వారు చెబుతున్నారు. కొందరు ఫ్యాన్స్ థియేటర్స్ లో ఫైర్ వర్క్స్ చేయడంతో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలూ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే సొంత అభిమానులే ప్రభాస్ సినిమాకు బ్యాడ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ మిక్స్డ్ టాక్ మధ్య కూడా ప్రభాస్ సినిమా భారీగానే కలెక్షన్స్ సాదిస్తుంది.మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ కూడా భారీగానే జరుగుతున్నాయి. రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు వచ్చాయంటూ నిర్మాతలు ప్రకటిస్తున్నారు. యూఎస్ లో 2 మిలియన్ డాలర్స్ మార్క్ ను కలెక్షన్స్ దాటాయి. డైరెక్టర్ మారుతి చెప్పినట్లు ఇలాంటి కొత్త కంటెంట్‌ను ఆడియెన్స్ రిసీవ్ చేసుకోవాలంటే మరో రెండు మూడు రోజులు సమయం పడుతుందేమో అనిపిస్తుంది.

Read Also: ట్రావెలింగ్ ఆపేస్తున్నా .. నా అన్వేష్ షాకింగ్ నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>