కలం, వెబ్ డెస్క్: ఇటీవల అమెరికా, భారత్ మధ్య సంబంధాలు కాస్త క్షీణిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా టారిఫ్ వార్ ప్రకటించడం.. భారత్, రష్యా దగ్గర చమురు ఉత్పత్తులు కొనుగోలు విషయంలో అమెరికా కాస్త అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా రాయబారి సర్గియో గోర్ (Sergio Gor) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన భారత రాయభారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాకు భారత్ ఎంతో ముఖ్యమైన దేశమని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని సర్గియో గోర్ ఆకాంక్షించారు. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అమెరికా రాయబారి కార్యాలయంలో గోర్ మీడియాతో మాట్లాడారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ స్నేహం ఉంది. వారిద్దరూ కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోగలరు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
“భారతదేశం ప్రపంచంలో పెద్ద దేశాల్లో ఒకటి. అందువల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు నెలకొల్పడం సులభం కాదు. అయినా మనం దీన్ని సాధించడానికి సంకల్పంగా ఉన్నాము” అని తెలిపారు. గోర్, వాణిజ్యం భారత–అమెరికా సంబంధాల ముఖ్య అంశం అయినప్పటికీ, భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలు, ఎనర్జీ, సాంకేతికత, విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా రెండు దేశాలు దగ్గరగా పనిచేస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత మెరుగు పరుస్తామన్నారు.

Read Also: రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్.. అలైవ్’
Follow Us On : WhatsApp


