epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

షాకింగ్.. చిరంజీవి సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి

కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేశ్ కాంబోలో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ (MSVPG) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సోమవారం ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక సందడి నెలకొంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ‘మెగా అభిమానులకు ఫుల్ మీల్స్. ఈ సినిమానే సంక్రాంతి విన్నర్. చిరు-వెంకీ కాంబో అదిరిపోయింది’ అంటూ మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి మూవీ విడుదల నేపథ్యంలో హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమా చూస్తూ ఓ అభిమాని (Chiranjeevi Fan Dies) మృతిచెందాడు. గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. వైద్య పరీక్షల తర్వాత మరణానికి గల సరైన కారణాలు తెలియజేస్తామని పోలీసులు చెప్పారు.

Chiranjeevi Fan Dies
Chiranjeevi Fan Dies

Read Also: మరోసారి వార్తల్లోకి మోక్షజ్ఞ..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>