కలం, సినిమా: నట సింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి రావడం లేదు. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని న్యూస్ వైరల్ అయ్యింది. ఈ ఇయర్ లో ఖచ్చితంగా ఈ నందమూరి మూడోతరం వారసుడు ఎంట్రీ ఉంటుందని.. బాలయ్య ఆమధ్య చెప్పారు. ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..?
ఆదిత్య 369 కథ ఎప్పుడో రెడీ అయ్యింది. ఈ మూవీ కథను రెడీ చేసింది సింగీతం శ్రీనివాసరావు. ఆయనే డైరెక్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. బాలయ్య తను డైరెక్ట్ చేస్తాను అన్నారట. ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అయితే.. ఆదిత్య 999 కోసం రాసుకున్న సీన్స్ ని కల్కిలో పెట్టాసారట. అందుచేత ఇప్పుడు క్రిష్ (Krish) కంప్లీట్ గా సింగీతం ఇచ్చిన కథను పక్కనపెట్టి సరికొత్త స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. త్వరలో ఈ క్రేజీ మూవీకి సంబంధించి అనౌన్స్ మెంట్ వస్తుందని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి అప్ డేట్ ఏంటంటే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. జనవరి ఎండింగ్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా (Movie)ని ప్రాంరభించడానికి ప్లానింగ్ జరుగుతుందని తెలిసింది. ఇక మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇందులో మోక్షజ్ఞ పాత్ర చాలా స్టైలీష్ గా ఉంటుందని.. అలాగే కథను కూడా చాలా డిఫరెంట్ గా ఉండేలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. మరి.. మోక్షజ్ఞను క్రిష్ ఎలా ప్రెజెంట్ చేస్తారో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.


