కలం వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను (International Kite Festival) ప్రారంభించారు. ఈ వేడుకలకు జర్మనీ (Germany) చాన్స్‌లర్ ఫ్రిడ్రిచ్ మర్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మోడీ, మర్జ్ సబర్మతి రివర్ ఫ్రంట్‌కు చేరుకోగానే వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆక్టటుకున్నాయి. తర్వాత ప్రధాని మోడీ, మర్జ్ పతంగులు ఎగరేశారు. మోడీ ప్రత్యేకంగా “భారత్ వసుధైక కుటుంబం” అనే సందేశంతో ఒక పతంగిని ఎగురవేసి ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారత తత్త్వాన్ని చాటిచెప్పారు. ఇండియన్ ఫ్లాగ్, దేవుళ్లు, భారత్, జర్మనీల స్నేహాన్ని సూచించే రంగురంగుల పతంగులతో ఆకాశం అందంగా మారిపోయింది.
వందల మంది ప్రజలు రివర్‌ఫ్రంట్‌లో ఈ ప్రదర్శనలను చూసేందుకు తరలివచ్చారు. కార్యక్రమంలో భారత్, జర్మనీ దేశాల జాతీయ జెండాలను ఊరేగించారు. ఈ వేడుకలు ప్రతి ఏటా జనవరి 12న ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగుతాయి. సుమారు 50 దేశాల నుంచి 135 అంతర్జాతీయ వ్యక్తులు ఈ వేడుకల్లో (Kite Festival) పాల్గొని పతంగులు ఎగరేస్తారు. ఈ వేడుకలకు ముందు ప్రధాని మోడీ, మర్జ్ సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
Read Also: కట్టుబాట్లను ధిక్కరించి.. ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు
Follow Us On: Instagram


