కలం వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తన భార్య బ్రాహ్మణితో కలిసి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ(Shirdi)కి చేరుకున్నారు. సాయినాథుని ఆశీస్సులు పొందేందుకు వచ్చిన లోకేశ్ దంపతులకు ఆలయ యాజమాన్యం సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికింది. సోమవారం ఉదయం షిరిడీ ఆలయంలో జరిగే కాకడ హారతి కార్యక్రమంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆయనకు స్వాగతం తెలిపారు. షిరిడీ విమానాశ్రయంలో కోపర్గావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ అధ్యక్షుడు అశుతోష్ ఆకాశరావు కాలే తదితరులు మంత్రి లోకేశ్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఈ పర్యటనలో మంత్రి లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు.


