కలం, వెబ్ డెస్క్: వరంగల్‌లో భూభారతి (Bhu Bharati) అడ్డాగా భారీ అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొందరు కేటుగాళ్లు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జీలు కాజేశారు. థర్డ్ పార్టీ అప్లికేషన్ సహాయంతో చలాన్ అమౌంట్ ఎడిట్ చేసి, జనగామలో ఒకేరోజు 10 చలాన్లకు చెందిన 8,55,577 రూపాయలు కొల్లగొట్టారు. అనుమానంతో ఉన్నతాధికారులు చాలాన్లపై విచారణకు ఆదేశించారు. జనగామ తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూభారతి కుంభకోణానికి CCLA టెక్నికల్ సిబ్బంది సహకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణి స్లాట్ బుకింగ్ నుండే దందా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
అయితే భూభారతి చలాన్ల స్కామ్‌లో రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ ఫీజు మొత్తం చెల్లించాలని రైతులకు (Farmers) తహసీల్దార్ నోటీసులు చేశారు. ఫీజ్ చెల్లించి డాక్యుమెంట్ రెగ్యులర్ చేసుకోవాలని అమ్మినవారు, కొన్నవారికి నోటీసులు ఇచ్చారు. ఆన్లైన్ నిర్వాహకులు కొట్టేసిన సొమ్ము తమను చెల్లించాలనడంతో రైతులు షాక్ అయ్యారు. రెవెన్యూ అధికారుల నిర్వహణ లోపంతో తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


