కలం, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డేలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. తన ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు వేసిన ఒక్క త్రో.. అందరినీ ఆశ్చర్యానికి గురుచేసింది. అయ్యర్ (Shreyas Iyer) సూపర్ త్రో మైఖేల్ బ్రెస్‌వెల్‌ను రనౌట్ చేసింది. ప్రస్తుతం ఈ సూపర్ త్రో వైరల్ అవుతోంది. న్యూజీలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు సాధించింది. డారిల్ మిచెల్ 71 బంతుల్లో 84 పరుగులు, డెవాన్ కాన్వే 67 బంతుల్లో 56 పరుగులు, హెన్రీ నికోల్స్ 69 బంతుల్లో 62 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2/40, హర్షిత్ రాణా 2/65, ప్రసిధ్ కృష్ణ 2/60 వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నారు.
ఓపెనర్లు కాన్వే, నికోల్స్ జోడించిన 117 పరుగుల భాగస్వామ్యం జట్టు ఆరంభాన్ని బలంగా ప్రారంభించింది. వీరిని రాణా, సిరాజ్ ఔట్ చేశారు. ఫిలిప్స్, మిచెల్ హే, ఫోల్కర్స్ వికెట్లు కుల్దీప్, ప్రసిధ్ తీశారు. సెంచరీ దిశగా ఉన్న డారిల్ మిచెల్‌ను ప్రసిధ్ కృష్ణ బోల్తా కొట్టించాడు. చివరలో క్రిస్టియన్ క్లార్క్, కైల్ జెమీస్ సహాయం తో జట్టు స్కోరు 300 పరుగులకు చేరింది. దీంతో ఇప్పుడు భారత్ ముందు 301 పరుగుల లక్ష్యం ఉంది. అయితే టీమిండియా బ్యాటర్ లైనప్‌తో ఇది పెద్ద టార్గెట్‌గా నిలవదని అభిమానులు భావిస్తున్నారు. మరి ఫ్యాన్స్ అంచనాలను భారత్ అందుకుంటుందా? టీమిండియా బ్యాటర్లు తమ సత్తా చాటుకుంటారా? అనేది చూడాలి. అయితే టీమిండియా బ్యాటర్లు అందరూ మంచి ఫామ్‌లో ఉండటంతో మొదటి వన్డేలో ఇండియా గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయని, ఇప్పుడు కివీస్‌ను గెలిపించే భారమంతా కూడా ఆ జట్టు బౌలర్లపైనే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Read Also: సినిమా కలలపై దాడులు.. విజయ్ దేవరకొండ భావోద్వేగం
Follow Us On : WhatsApp


