కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) జిల్లా కొండపాక మండలం సిరిసనగండ్ల (Sirisanagandla) లో పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులో అటవీ ప్రాంతం పరిసరాల్లో పులి తిరుగుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న పశువుల దొడ్లలోని రెండు ఆవులను పులి చంపి పీక్కొని తిన్నది. పులి తరచూ జనావాసాల్లోకి రావడం, పశువులపై దాడులు చేస్తుండటంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గ్రామస్తులు పులి సంచారం గురించి అటవీ శాఖ (Forest Department) అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పులి కదలికలను పరిశీలించారు.
Read Also: సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్: హరీశ్ రావు
Follow Us On : WhatsApp


