కలం, వెబ్ డెస్క్: ఇటీవల హైదరాబాద్‌లో చైనా మాంజా (Chinese Manja) బారిన పడి గాయాలపాలవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చైనా మాంజా ప్రాణాంతకమని ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారడం లేదు. ఇంకా చైనా మాంజా విక్రయాలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల చైనా మాంజాతో వాహనదారులు గాయాలపాలయ్యారు. తాజాగా హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ (Sajjannar) ట్వీట్ చేశారు.
‘మియా, యే పతంగ్ కా మామ్ లా నహీ హై
యే జిందగీ ఔర్ మౌత్ కా సీన్ హై .
చైనీస్ మాంజా కో సీదా నో బోలా.
పతంగ్ ఫిర్ ఉడేగీ
పర్ అగర్ జాన్ గయీ, వాపస్ నహీ ఆతీ’
అంటూ సజ్జనార్ (Sajjannar) ట్వీట్ చేశారు. పతంగులు మళ్లీ మళ్లీ ఎగరేసే అవకాశం ఉంటుంది కానీ.. ఒక్కసారి ప్రాణం కోల్పోతే తిరిగిరాదంటూ ఆయన ట్వీట్ లో ప్రస్తావించారు. చైనా మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని.. ఎవరికివారు చైనా మాంజా విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఓ వైపు చైనా మాంజా విషయంలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అక్కడక్కడా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్-ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ రెడ్డి మెడకు గాయాలయ్యాయి. మెడపై లోతైన గాయం కావడంతో వెంటనే స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Read Also: ప్రపంచంతో పోటీ పడేలా విజన్ 2047 : డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On: Sharechat


