కలం వెబ్ డెస్క్ : విజయవాడలోని (Vijayawada) లెనిన్ సెంటర్‌లో ఆదివారం ఉదయం సినీ నటుడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ (Superstar Krishna Statue) జరిగింది. కృష్ణ మనవడు జయకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరి రావు, ఈ కార్యక్రమానికి నిర్మాత అశ్వినీదత్, ఎంపీలు రఘురామ కృష్ణం రాజు, కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు హాజరయ్యారు. కృష్ణకు విజయవాడతో గొప్ప అనుబంధం ఉంది. ఆయనకు స్థానికంగా లక్షలాది మంది అభిమానులున్నారు.
కృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ అగ్ని పర్వతం విడుదలై 45 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్థానిక అభిమానులు కృష్ణ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారని ఆదిశేషగిరి రావు వెల్లడించారు. అభిమానుల కోరిక మేరకు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ.. మహేశ్ బాబుకు తాను వీరాభిమాని అని చెప్పారు. బాబాయ్ మహేశ్ బాబు ఎప్పుడూ ప్రోత్సహిస్తారని వెల్లడించారు. తాతయ్య కృష్ణ ఎల్లప్పుడూ తన పక్కనే ఉండి నడిపిస్తున్నారని, తాతయ్య ఎక్కడున్నా గర్వపడేలా ఉండటమే తన లక్ష్యం అని వెల్లడించారు.

Read Also: పవన్ జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం : సీపీఐ నారాయణ
Follow Us On : WhatsApp


