కలం వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకమని విమర్శించారు. సనాతన ధర్మంలో విడాకులు లేవని నారాయణ అన్నారు. పవన్ మొదట్లో వామపక్షవాదిని అని, చెగువేరా శిష్యుడిని అని చెప్పుకున్నారన్నారు. ఆ తర్వాత చెగువేరా డ్రెస్ తీసేసి కాషాయం డ్రెస్ వేసుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాను సనాతన ధర్మానికి ప్రతిబింబం అని చెప్పుకుంటున్నారని, కేవలం మోడీ, అమిత్ షా మెప్పు పొందేందుకే ఇలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
ప్రభుత్వంలో ఉండాలంటే పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదని సూచించారు. సనాతన ధర్మాన్ని పాటిస్తానంటూ తనకు తాను ద్రోహం చేసుకుంటూ, ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఇలా ప్రభుత్వంలో ఉండి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే వారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండటం చాలా దురదృష్టకరమన్నారు.

Read Also: సంక్రాంతికి బస్సుల జాతర..
Follow Us On: Sharechat


