కలం వెబ్ డెస్క్ : సంక్రాంతి సందర్భంగా ఏపీలో ఊపందుకున్న కోడి పందేలపై (Sankranti Cockfights) హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జంతు హింస నిరోధక చట్టాలు, జూద నిరోధక చట్టాలు కఠినంగా అమలు చేయాలని, కోడి పందేలు, జూదం నిర్వహణను ఉపేక్షించవద్దని పేర్కొంది. ఏటా సంక్రాంతి సమయంలో కొన్ని రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో కోడి పందేలు, జూదంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో కొన్ని ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి.
వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోడి పందేలు, జూదం నిర్వహణపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే 144 సెక్షన్ విధించాలని సూచించింది. కోడి పందేలు, జూదాల్లో పట్టుబడ్డ నగదును సీజ్ చేయాలని ఆదేశించింది. ఎక్కడైనా వీటి నిర్వహణకు సంబంధించి సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఎస్సైలు, తహసీల్దార్లతో తనిఖీలు నిర్వహించాలని సూచించింది.

Read Also: హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి ఫుల్ ప్యాక్
Follow Us On: Sharechat


