కలం వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై (Komatireddy Venkat Reddy) వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకట్‌రెడ్డి మీద వీడియోలు, వార్తలు చేయమని ప్రోత్సహించిన వాడు ముందుకు వస్తే చెప్పుతో కొడతా అన్నారు. ఈ వీడియోలు, వార్తలు చేయమని చెప్తున్న వాడు ప్రజల ముందుకు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు సంబంధాలు పెట్టి వైరల్ చేయిస్తున్నారని మండిపడ్డారు. వెంకట్ రెడ్డి ఎన్నో కష్టాలు పడి ఎదిగిన నాయకుడు అని చెప్పారు. ఇలాంటివి ఎవరు పోస్ట్ చేసినా, వైరల్ చేసినా చెప్పుతో కొడతానని ఘాటుగా స్పందించారు.
ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. ఇలా దుష్ప్రచారం చేసే బదులు ఇంత విషం ఇచ్చి చంపేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్ సైతం ఐఏఎస్ మహిళా అధికారిపై దుష్ప్రచారం తగదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు పోస్టులు , వీడియోలు తొలగించాలని, మహిళా అధికారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Read Also: హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి ఫుల్ ప్యాక్
Follow Us On : WhatsApp


