epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సిరియాలో ఐసిస్ స్థావ‌రాల‌పై అమెరికా ప్ర‌తీకార దాడులు

క‌లం వెబ్ డెస్క్‌ : సిరియాలోని (Syria) ఐసిస్ స్థావ‌రాల‌పై అమెరికా (America), దాని మిత్ర దేశాల సైన్యాలు భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించాయి. గత నెలలో ఐసిస్ దాడిలో ముగ్గురు అమెరికన్లు మృతి చెందిన ఘటనకు ప్ర‌తీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం అమెరికా సైన్యం మిత్ర దేశాల సహకారంతో సిరియా వ్యాప్తంగా అనేక ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్లు సెంట్ర‌ల్ క‌మాండ్‌ తెలిపింది.

‘ఆపరేషన్ హాక్‌ ఐ స్ట్రైక్’ పేరుతో ఈ దాడులు నిర్వహించారు. 2025 డిసెంబర్ 19న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభమైందని వెల్లడించారు. డిసెంబర్ 13న సిరియాలోని పామైరా ప్రాంతంలో అమెరికా, సిరియా దళాలపై ఐసిస్దా డులు చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అమెరికా సైనికులు, ఒక సామాన్య పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఐవా నేషనల్ గార్డ్ సభ్యులు గాయపడ్డారు. ఈ నేప‌థ్యంలో సైనికులకు హాని కలిగిస్తే, ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ అంతమొందిస్తామ‌ని సెంట్ర‌ల్ క‌మాండ్‌ హెచ్చరించింది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అరికట్టడం, భవిష్యత్ దాడులను నివారించడం, అమెరికా, దాని మిత్ర దళాల భద్రతను కాపాడడమే ఈ దాడుల లక్ష్యమని పేర్కొంది.

Syria
Syria

Read Also: పేరుకే మంత్రులు.. కీ ఎవరి చేతుల్లో..?

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>