కలం, సినిమా : తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ” జన నాయగన్”.(Jana Nayagan) కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మాణంలో హెచ్.వినోద్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. విజయ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ కానుండటంతో తన చివరి సినిమాగా జన నాయగన్ లో నటించారు.
విజయ్ చివరి సినిమా చూడాలని ఎంతో ఆశగా ఉన్న ఫ్యాన్స్ వాయిదా విషయం తెలిసి నిరాశ చెందారు. అయితే ఈ పండుగకు విజయ్ నుండి కొత్త సినిమాకు బదులుగా రిరీలీజ్ మూవీ రానుంది. విజయ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘తేరీ’ (Theri) (తెలుగులో ‘పోలీసోడు’) ను జనవరి 15న తమిళనాడులో రీరిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వీ.క్రియేషన్స్ సోషల్ మీడియాలో తెలిపింది. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరక్షన్ లో వచ్చిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ (Theri) 2016 లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
Read Also : అజిత్ దోవల్ అసలు ఫోన్ వాడరట!
Follow Us On : Twitter


