కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్‌లో వాహనాలు నడుపుతున్నరా..? ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు లేరు కదా ఏమీ కాదు అనుకొని ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానా కట్టక తప్పదు.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారి ఫోటోలు ట్రాఫిక్ పోలీసులు తీసి చలాన్లు వేసే వారు.. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కనిపించకుండనే రూల్స్ తప్పితే ఆన్‌లైన్ ద్వారనే చలాన్ పడుతుంది. కరీంనగర్లో (Karimnagar) ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు ఎన్నిసార్లు చెప్పిన ఫలితం శూన్యం.. ప్రతి రోజు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం.. ఎక్కడైన ట్రాఫిక్ పోలీసులు ఆపితే వారిపై గొడవకు దిగడం వంటివి నిత్యం చూస్తున్న వార్తలు.
Karimnagar పోలీసులు ఎవరితో ఎలాంటి గోడవలు లేకుండా రూల్స్ తప్పితే చాలు ఆన్ లైన్లో చలాన్ పడే పద్దతికి శ్రీకారం చూట్టారు. పట్టణంలోని ట్రాఫిక్స్ రూల్స్ ను బ్రేక్ చేస్తున్న వారి ఆట కట్టించడానికి 750 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా నిత్యం రూల్స్ తప్పిన వారికి ఆన్ లైన్లో చలాన్లు వేస్తున్నారు. గతేడాది జనవరి 1వ తేది నుంచి డిసెంబర్ 31 వరకు సీసీ కెమెరాల ద్వార భారీగా ట్రాఫిక్స్ రూల్స్ బ్రేక్ చేసిన కేసులు నమోదు చేశారు.
ఇందులో ట్రిపుల్ రైడింగ్ కేసులు 68,484 కాగా హెల్మెట్ లేని ప్రయాణం కేసులు 59,426 నమోదు అయ్యాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు – 36,211 కాగా ఆన్ రోడ్ పార్కింగ్ కేసులు 16,607 నమోదు చేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ 6,662 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3,242, నెంబర్ ప్లేట్ లేని వాహనాల కేసులు 3,148 నమోదు అయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కరీంనగర్లో పోలీసులు చేపట్టిన చర్యలతో రూల్స్ బ్రేక్ చేస్తున్న వారికి తెలియకుండానే చలాన్లు నమోదు కావడం విశేషం.
Read Also : అజిత్ దోవల్ అసలు ఫోన్ వాడరట!
Follow Us On : Twitter


