కలం వెబ్ డెస్క్: ఒడిశాలో (Odisha) ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రూర్కెలా (Rourkela) నుంచి భువనేశ్వర్‌కు (Bhubaneswar) ప్రయాణిస్తున్న ఓ చార్టెడ్ ఫ్లైట్ (Chartered Flight) అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం రూర్కెలా నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో జరిగింది. విమానంలో మొత్తం పైలట్ సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఫ్లైట్ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి సాంకేతిక సమస్యే కారణమా? లేక మరేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది.
ఒడిశాలోని రౌర్కెలాలో చార్టర్డ్ విమానం క్రాష్ ల్యాండింగ్
Charter Plane Makes Emergency Crash Landing in Odisha, Rourkela; 6 Injured.#Rourkela #Odisha #Raghunathpali #Bhubaneswar #PlaneCrash #EmergencyLanding #CrashLanding #AviationAccident #Kalam #Kalamdaily #Kalamtelugu pic.twitter.com/7smDX2Zkwi— Kalam Daily (@kalamtelugu) January 10, 2026
Read Also: ఆ వార్తలు ఆక్షేపణీయం: ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం
Follow Us On: X(Twitter)


