కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరినీ ఉరి తీయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పలు చోట్ల కేటీఆర్‌కు నిరసన ఎదురవుతున్నది. కేటీఆర్ చిత్రపటాలకు ఉరి వేసి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. శనివారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ చిత్రపటానికి చెప్పుల దండ వేసిన నిరసన తెలిపారు.
దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో యూత్ కాంగ్రెస్ నాయకుడికి తలకు గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేపట్టారు. ‘కేటీఆర్, పల్లా డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్, పల్లా చిత్రపటాలకు పిండ ప్రదానం చేశారు. రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి కటౌట్‌లకు ఉరితీసి హార్పిక్ తో కడిగిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: విషమిచ్చి చంపేయండి.. లేదంటే సూసైడ్ చేసుకుంటా: కోమటిరెడ్డి
Follow Us On: X(Twitter)


