కలం వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మూవీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోలు, టికెట్స్ రేట్ల విషయంలో తెలంగాణలో ఈ సినిమా భారీ నష్టాలు చవిచూసింది. తాజాగా రాజాసాబ్‌కు పైరసీ రూపంలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. విడుదలైన రెండో రోజే రాజా సాబ్ మూవీ హెచ్డీ ప్రింట్ (HD Print) ఆన్లైన్లో దర్శనమిచ్చేసింది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
టికెట్స్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయాన్ని ప్రకటించడం, తెలంగాణ హైకోర్ట్ ప్రభుత్వ మెమోను కొట్టేయడం సినిమా వసూళ్లను భారీగా ప్రభావితం చేసింది. ఇక ఆన్లైన్లో నెగటివ్ ప్రచారం, ప్రతికూల రివ్యూలు కూడా సినిమాకు కొంత మేర నష్టం కలిగిస్తాయనే చెప్పవచ్చు. వీటికి తోడు పైరసీ సైట్లలో హెచ్డీ ప్రింట్ రాజాసాబ్ నిర్మాతలకు తలనొప్పిగా మారింది. వీటన్నింటినీ తట్టుకొని రాజాసాబ్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.112 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి సందర్భంగా వరుసగా మరిన్ని సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఇక రాజాసాబ్ వసూళ్లపై ఇవన్నీ ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి.

Read Also: ఆ ఫైట్ సీన్స్ యాడ్ చేశాం : మారుతి
Follow Us On : WhatsApp


