కలం వెబ్ డెస్క్ : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండలో (Irusumanda) ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీతో (ONGC Gas Leak) మొదలైన మంటలు ఎట్టకేలకు శనివారం అదుపులోకి వచ్చాయి. ఈ రోజు ఉదయానికి ఓఎన్జీసీలో మంటలు పూర్తిగా నిలిచిపోయాయి. సిబ్బంది ఓఎన్జీసీ (ONGC) బావికి బీఓపీ పైపును అమర్చడంతో సమస్య పరిష్కారమైంది. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ మంటలకు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఓఎన్జీసీ సిబ్బంది, యంత్రాంగం చాకచక్యంగా వ్యవహరించి మంటలు అదుపు చేసేందుకు కృషి చేశారు. మంటలు ప్రారంభమైన మొదట్లో సుమారు ఐదు కిలోమీటర్ల మేర ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆకాశాన్ని తాకేలా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ వందలాది కొబ్బరి చెట్లు ధ్వంసం అయ్యాయి.
Read Also: పవన్ కల్యాణ్ డ్యాన్స్‌పై అంబటి రాంబాబు సెటైర్లు
Follow Us On: X(Twitter)


