కలం వెబ్ డెస్క్ : విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో (Kanaka Durga Temple) అధికారుల నిర్లక్ష్యం రోజురోజుకూ హద్దులు దాటుతోంది. ఇప్పటికే పలు అవాంఛనీయ ఘటనలతో పవిత్ర ఆలయం తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం భక్తులకు ప్రసాద వితరణ చేసే కౌంటర్ వద్ద కరెంట్ షాక్ తగిలింది. దీంతో వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు. లక్షలాది భక్తులు వచ్చే దుర్గమ్మ ఆలయంలో ఇంత నిర్లక్ష్యం ఏమిటని ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలపై భక్తులు మండిపడుతున్నారు. డిసెంబర్ 27న ఆలయంలో పవర్ కట్ జరగడం తీవ్ర దుమారాన్ని రేపింది. కొందరు వ్యక్తులు ఆలయ పరిసరాల్లో చెప్పులతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు నిన్న శుక్రవారం శ్రీ చక్ర అర్చనలో అమ్మవారికి వాడిన పాలలో పురుగులు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆలయ (Kanaka Durga Temple) అధికారులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: మహిళా ఐఏఎస్‌పై ఆరోపణలను ఖండించిన ఐపీఎస్ అసోసియేషన్
Follow Us On: X(Twitter)


