epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ సిరప్‌ వాడొద్దు.. తెలంగాణ DCA హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: పిల్లల సిరప్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (Telangana DCA) కీలక నిర్ణయం తీసుకుంది. Almont-Kid Syrup వాడకూడదని హెచ్చరించింది. సిరప్‌లో ప్రమాదకర ఇథిలీన్ గ్లైకాల్ మోతాదుకు మించి ఉన్నట్లు గుర్తించింది. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ తయారీ సిరప్‌లో (Syrup) కల్తీ ఉన్నట్టు, AL-24002 బ్యాచ్ సిరప్ కల్తీ అయినట్లు నిర్ధారించింది. ఈ రకమైన సిరప్ వాడకం తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు సిరప్ ఇవ్వవద్దని సూచించారు.

Read Also: బెట్టింగ్ యాప్ కేసులో ఎస్సై అరెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>