కలం వెబ్ డెస్క్: ఇరాన్‌లో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం (Iran Crisis) కారణంగా భారత బాస్మతి రైస్ ఎగుమతులు (Basmati Rice Exports) తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఇరాన్ రియాల్ కరెన్సీ విలువ క్షీణించడం, ఆహార దిగుమతులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేత వంటి కారణాల వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైస్ మిల్లర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం, రూ.2,000 కోట్ల విలువ ఉన్న బాస్మతి రైస్ షిప్‌మెంట్లు అంతర్జాతీయ పోర్టుల్లో నిలిచిపోయి, ఇరాన్‌కు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. పంజాబ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఎగుమతిదారు రంజీత్ సింగ్ జోసన్ మాట్లాడుతు.. ఇరాన్ రియాల్ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయికి పతనమయ్యిందన్నారు. దీని కారణంగా ఇరాన్ ప్రభుత్వం ఆహార దిగుమతులపై సబ్సిడీలు నిలిపివేసిందని తెలిపారు. దీని వల్ల ఎగుమతిదారులు వ్యాపారం కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని చెప్పారు.
గతంలో భారత్, ఇరాన్ మధ్య సరిహద్దు వ్యవహారాల ద్వారా వాణిజ్యం కొనసాగింది. కానీ భారత్ ఇరాన్ నుంచి నూనె దిగుమతి నిలిపివేసిన తర్వాత ఆ వ్యవస్థ ముగిసింది. అయినప్పటికీ ఇరాన్ కాఫీ, బాస్మతి రైస్, ఔషధాల వంటి ఆహార పదార్థాలను భారత్ నుండి దిగుమతి చేసుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆ దిగుమతులు కూడా ఆగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ ప్రతి సంవత్సరం భారత్ నుంచి సుమారు 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేస్తుంది, దాని వల్ల సుమారు రూ.12,000 కోట్లు ఆదాయం లభిస్తుంది. ఇందులో సుమారు 40 శాతం పంజాబ్, హర్యానా నుండి వస్తుంది. ఈ ఎగుమతులపై పడ్డ ప్రభావంతో ఇప్పటికే రైస్ మిల్లర్లు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also: అట్లాంటిక్‌లో ఆయిల్ ట్యాంకర్ల వేట.. అమెరికా అదుపులో ఐదో నౌక
Follow Us On: Instagram


