కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) లో ఏటీఎం(ATM) దోపిడీ దొంగల ముఠాను వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య నిందితుల వివరాలు, ఘటనలు వివరించారు. హర్యానా(Haryana) కు చెందిన లారీ డ్రైవర్లు అబ్దుల్లా ఖాన్, శామోద్దిన్, వెల్డింగ్ చేసే వ్యక్తి వాజీబ్ ఖాన్, మెకానిక్ మొహమ్మద్ అజీబ్, హైదారాబాద్ లోని బేగంపేట వ్యక్తి ప్రస్తుతం ముంబై లో నివాసం ఉంటున్న మొహమ్మద్ అమీర్ అన్సారి ఐదుగురు గత డిసెంబర్ 31 నాడు రాత్రి 2 గంటలకు నిజామాబాద్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎటిఎం(ATM) ను ధ్వంసం చేసి గ్యాస్ కట్టర్ తో కాల్చి డబ్బులు దొంగిలించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బ్లూ కోల్ట్ విధులు నిర్వహించే న్యాలకంటి లక్ష్మణ్ అటు వైపు వెళ్తూ గమనించి ఏటీఎం లోకి వెళ్ళే ప్రయత్నం చేయగా దొంగలు పరారయ్యారు. నిజామాబాద్ సిపి(CP) ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసుని ఛేదించారు. సిసిటీవి(CCTV) ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించి వారి గురించి గాలించారు.
జనవరి 8న నిజామాబాద్ లో వాహనాల తనిఖీలు చేస్తుండగా నేరస్తులు బొలెరో వాహనములో కర్రలు, రాళ్లు పెట్టుకొని వస్తుండగా వారిని ఆపి చెక్ చేసి విచారించగా దొంగలు దొరికారు. హర్యానాకు చెందిన అబ్డుల్లా తన గ్యాంగ్ మెంబర్స్ అయిన ఆసిఫ్, అర్షద్, అజ్మీర్ లతో కలిసి 2018 లో ఉదయపుర లో ఎటిఎం (ATM) చోరీ అలాగే శివపురి లో ఎటిఎం చోరీ వంటి కేసులలో జైలు కి వెళ్ళాడు. ఆ సమయంలో హైదరాబాద్ కు చెందిన అమీర్ ఇంస్టాగ్రామ్ (Instagram) లో మధ్యప్రదేశ్ కు చెందిన అమ్మాయితో పరిచయము అయి ఆమెను తన ఇంటికి తెచ్చుకోగా.. అమ్మాయి మైనర్ అయినందున తన తల్లిదండ్రులు మైనర్ ఫోక్సో కేస్ పెట్టగా శివపురి పోలీస్ వారు జైలుకు పంపారు. జైలులో అబ్దుల్లా గ్యాంగ్ తో పరిచయమయి తెలంగాణాలో ఏటిఎం కొల్లగొట్టే పథకంతో హైదరాబాద్ కు వచ్చి వారు లూటీ కి కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్, ఒక చిన్న ఎల్పీజీ (LPG)సిలిండర్, గ్యాస్ కట్టర్, గ్లౌస్ లు, నల్లటి రంగు స్ప్ప్రే బాటిల్ వంటివి కొనుగోలు చేశారు. జనవరి 8న షాపూర్ నగర్ మార్కండేయ నగర్ రోడ్ ప్రక్కన గల ఏటీఎంను కొల్లగొట్టి అందులో నుండి 30 లక్షల వరకు డబ్బును దొంగిలించి జీడిమెట్ల బస్ డిపో వద్ద డ్రైనేజ్ లో గ్యాస్ కట్టర్ సామాగ్రిని పారవేశారు.


