కలం, వెబ్‌డెస్క్: నగరంలో వాహనదారులకు సంక్రాంతి ఎఫెక్ట్ శుక్రవారం సాయంత్రమే మొదలైంది. పండగకు ఊళ్లకు వెళ్లేవాళ్ల వాహనాలు, ఆఫీసు నుంచి ఇళ్లకు బయల్దేరే వెహికల్స్‌తో నగరంలో చాలా చోట్ల రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అలెర్ట్ (Traffic Police alert) జారీ చేశారు. వాహనాలు భారీగా తరలిరావడంతో లక్డీకాపూల్ నుంచి చాపెల్ రోడ్, పబ్లిక్ గార్డెన్స్, గన్ పార్క్, అసెంబ్లీ, రవీంద్ర భారతి, చీఫ్ ఆఫీస్ వెళ్లే మార్గాల్లో రెండు వైపులా ట్రాఫిక్ నెమ్మదించినట్లు చెప్పారు. దీంతో ఈ మార్గంలో కాకుండా పత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా వెల్లడించారు. కాగా, మరో మూడు రోజులు నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో ఇదే పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి ప్రయాణికులు, వాహనదారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరిస్థితి తెలుసుకుంటూ వెళ్లడం మంచిది.


