epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

లోయలో పడిన బస్సు.. 9 మంది దుర్మరణం

కలం, వెబ్​డెస్క్​: హిమాచల్​ ప్రదేశ్​లో (Himachal Pradesh) శుక్రవారం మధ్యాహ్నం ఘోర దుర్ఘటన జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడడం (Bus falls into gorge) తో 9 మంది దుర్మరణం పాలవగా, 40 మంది గాయపడ్డారు. గాయాలపాలైన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాచల్​ ప్రదేశ్​లోని సిమ్లా నుంచి కుప్వికి ఓ ప్రైవేటు బస్సు బయలుదేరింది. సిర్మౌర్ జిల్లాలోని హరిపుర్ధర్​ గ్రామ సమీపంలో ఎత్తైన కొండల మీదుగా వెళుతుండగా, హఠాత్తుగా అదుపు తప్పిన బస్సు 500 అడుగుల లోతైన లోయలో తలకిందులుగా పడింది. దీంతో తొమ్మిది మంది అక్కడకక్కడే మృతిచెందారు. ప్రమాద స్థలం జిల్లా కేంద్రానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో సహాయ బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆలస్యం అయ్యింది. కాగా, పర్వతాల రాష్ట్రంగా పేరు పొందిన హిమాచల్​ ప్రదేశ్​లో రోడ్ల వెంబడి అనేక ప్రమాదకర లోయలు ఉంటాయి.

Himachal Pradesh
Himachal Pradesh

Read Also: అమెరికా ఆంక్షల బిల్లుపై స్పందించిన కేంద్రం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>